Friday, May 23, 2025
Homeతెలంగాణ రౌండప్నిబంధనల ప్రకారమే ఇండ్ల నిర్మాణం జరగాలి..

నిబంధనల ప్రకారమే ఇండ్ల నిర్మాణం జరగాలి..

- Advertisement -

హౌజింగ్ పిడి రవీందర్ 
నవతెలంగాణ – పరకాల 
: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రభుత్వ నిబంధనల మేరకే జరిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని హౌసింగ్ పీడీ రవీందర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పరకాల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో ఆధ్వర్యంలో మండల స్థాయి ఇందిరమ్మ గృహ నిర్మాణ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పీడీ మాట్లాడుూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లబ్ధిదారులు ఆడంబరాలకు పోయి ఎక్కువ ఖర్చు పెట్టి నిర్మాణాలు చేపట్టకుండా కట్టడి చేయాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు.ఇంటి నిర్మాణం విషయంలో ప్రభుత్వం నియమ నిబంధనల మేరకే నిర్మించాల్సి ఉందన్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, హౌసింగ్ డీఈ,యంపీడీఓ జిల్లా కలెక్టర్ గృహ నిర్మాణాల పర్యవేక్షణ చేస్తారన్నారు.డైరక్టర్ హౌజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చెక్ చేసి ఏలాంటి అవకతవకలు జరిగినా సంబందిత అధికారుల పై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పరకాల లేబర్ అధికారి జి.వినోద్ కుమార్, హౌజింగ్ ఏఈ ఆకాంక్ష, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -