Thursday, January 22, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమహిళా యోధుల పోరాటాలను..కండ్లకు కట్టినట్టుగా వీడియో చిత్రీకరణ

మహిళా యోధుల పోరాటాలను..కండ్లకు కట్టినట్టుగా వీడియో చిత్రీకరణ

- Advertisement -

ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 14వ జాతీయ మహాసభల నేపథ్యంలో సమాజానికి, మహిళోద్ధరణకు మహిళా యోధులు చేసిన ప్రయత్నాలను, పోరాటాలను కండ్లకు కట్టినట్టుగా వీడియో సాంగ్‌లో చిత్రీకరించారని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అభినందించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో టీ10 సీఇవో సుందర్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో వీడియో సాంగ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సావిత్రభాయి ఫూలే, ఫాతీమా షేక్‌, కెప్టెన్‌ లక్ష్మి సెహగల్‌, మానికొండ సూర్యావతి, డాక్టర్‌ అచ్చమాంబ, మోటూరు ఉదయం, మల్లు స్వరాజ్యం తదితర మహిళా యోధుల గురించి వీడియో సాంగ్‌లో ఉన్నట్టు తెలిపారు. మహిళలను చైతన్య పరిచేందుకు వీడియో సాంగ్‌ను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఐద్వా శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐద్వా సీనియర్‌ నాయకులు టి.జ్యోతి, సోషల్‌ మీడియా ఇంఛార్జ్‌ బండారు రవి, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌, ఐద్వా అధ్యక్షులు ఆర్‌.అరుణజ్యోతి, పీఎన్‌ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా నర్సింహ, రాష్ట్ర నాయకులు ఎన్‌.మారయ్య, సోషల్‌ మీడియా రాష్ట్ర నాయకులు పిట్టల రవి, కర్నిక శంకర్‌, యాటల సోమన్న, ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కెఎన్‌ ఆశాలత, రాష్ట్ర నాయకులు ఎం.స్వర్ణలత, డి.ఇందిర, కవిత, సీఐటీయూ నాయకులు పద్మశ్రీ పాల్గొన్నారు. ఐద్వా వీడియో సాంగ్‌ను ప్రముఖ రచయిత రేలారే ప్రసాద్‌ రచించి ఆలపించారు. అఖిలేష్‌ గోగు సంగీతం అందించారు. టీ10 ప్రోగ్రెసివ్‌ మీడియా ఆధ్వర్యంలో ఈ పాటకు వీడియో చిత్రీకరించారు. ఐద్వా మహిళల కోసం చేసిన అనేక పోరాటాలు, సాధించిన విజయాలు, జాతీయ మహాసభల ప్రచారానికి సంబంధించిన విజువల్స్‌తో పాటు, మహాసభ ప్రచార నినాదాలతో వీడియోలో పొందుపరిచారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -