కే.సూర్యం.. టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయూసీఐ) జిల్లా కమిటీ సమావేశం కోటగల్లిలోని శ్రామిక భవన్ లో జరిగింది. అనంతరం జరిగిన ప్రెస్ మీట్ లో టీయుసీఐ రాష్ట్ర అధ్యక్షులు కే.సూర్యం మాట్లాడుతూ హైకోర్టు తీర్పుతో ఎన్నికల నోటిఫికేషన్ ను వాయిదా వేసిన ప్రభుత్వాలు, ఉద్యోగ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2016లో ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును ఇప్పటికీ అమలు చేయకపోవడం పాలకుల ద్వంద నీతిని తెలియజేస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయించాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వానిదని, అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదన్నారు. దేశంలో, రాష్ట్రంలో సంఘటిత, అసంఘటిత కార్మికులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు.
కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. అతి తక్కువ వేతనాలు కూడా నెలల తరబడి జీతాలు పెండింగులో పెట్టడం కార్మికులను హింసించడమే అవుతుందన్నారు. ఈ.ఎస్.ఐ, పి.ఎఫ్, ఇతర ఇన్సూరెన్స్ సౌకర్యాలు కూడా కార్మికులకు సక్రమంగా అమలు కాకపోవడం అన్యాయమన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్స్, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్, మున్సిపల్, గ్రామపంచాయతీ, మిషన్ భగీరథ, హాస్పిటల్, ఆశ, అంగన్వాడి, మధ్యాహ్న భోజనం కార్మికులు మరియు ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వం మరియు ఏజెన్సీల కాంట్రాక్టర్లు తక్కువ వేతనాలు ఇస్తూ, పని భారం పెంచి తీవ్ర మానసిక వేదనకు గురిచేస్తున్నారన్నారు.
అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి, ప్రభుత్వమే వేతనాలు ఇవ్వాలన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును ప్రక్షాళన చేయాలన్నారు. ఆటో, హమాలీ కార్మికులకు సామాజిక భద్రతను కల్పించాలని, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రెస్ మీట్ లో టీయుసీఐ ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు వి.కృష్ణ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.నరేందర్, ఎం.సుధాకర్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లేష్, జిల్లా కోశాధికారి పి.సాయరెడ్డి, జిల్లా నాయకులు మురళి, కిరణ్, లింగం, గంగాధర్, మక్కన్న తదితరులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES