న్యూఢిల్లీ : ఆరావళి పర్వతాలలో చేపట్టే మైనింగ్ కార్యకలాపాలపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరుపుతుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, ఏజీ మసిV్‌ాతో కూడిన త్రిసభ్య బెంచ్ సుమోటోగా ఈ సివిల్ కేసు విచారణ జరుపుతుంది. ‘ఆరావళి పర్వతా లు, వాటి పరిధుల నిర్వచనం.. అనుబంధ అంశాల ‘పై విచారణ జరుగుతుందని సుప్రీంకోర్టు వెబ్‌సైటులోని కేసుల జాబితా తెలిపింది. అరావళి హిల్స్‌కు సంబంధించి గత నెల 20వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్‌ను పర్యావరణవేత్తలు, పౌరులు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఆరావళి పర్వతాలు, వాటి పరిధులపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను సుప్రీంకోర్టు తన రూలింగ్‌లో ఆమోదించింది. దీనిపై పర్యావరణవేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వంద మీటర్ల కంటే తక్కువ ఎత్తున్న చోట మైనింగ్‌ను అనుమతిస్తే పెద్ద ఎత్తున తవ్వకాలు జరిగే అవకాశం ఉన్నదని మండిపడ్డారు. దీనివల్ల ఆరావళి హిల్స్ తమ సమగ్రతను కోల్పోతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.



