పశ్చిమబెంగాల్ సీఎం జోక్యంపై..
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్ మమతా బెనర్జీ జోక్యానికి వ్యతి రేకంగా ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను గురు వారం విచా రించనున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు కాజ్‌లిస్ట్ ప్రకారం.. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ విపుల్ పంచోలిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారించనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐప్యాక్ సోదాలపై ఈడీ, టీఎంసీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లను బుధవారం కోల్‌కతా హైకోర్టు కొట్టివేసిన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. బొగ్గు దోపిడీ స్కామ్‌కి సంబంధించి గతవారం ఈడీ ఐప్యాక్ కార్యాలయం, దాని డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. ఐప్యాక్‌పై జరిగిన ఈడీ దాడులకు సంబంధించి తమ వాదనలు వినకుండా ఎటు వంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని కోరతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసింది.
ఈడీ పిటిషన్‌ను విచారించనున్న సుప్రీంకోర్టు
- Advertisement -
- Advertisement -



