Tuesday, September 30, 2025
E-PAPER
Homeసినిమాసర్‌ప్రైజ్‌ చేసే 'థామా'

సర్‌ప్రైజ్‌ చేసే ‘థామా’

- Advertisement -

ఆయుష్మాన్‌ ఖురానా, రష్మిక హీరో, హీరోయిన్స్‌గా తెరకెక్కిన సినిమా ‘థామా’. హర్రర్‌ కామెడీగా రూపొందిన ఈ సినిమాకి ఆదిత్యా సర్పోత్దార్‌ దర్శకత్వం వహించారు. పరేష్‌ రావల్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ కీలక పాత్రలు పోషించారు. మాడాక్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో దినేష్‌ విజన్‌, అమర్‌ కౌశిక్‌ నిర్మించారు. ఈ మూవీ అక్టోబర్‌ 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్‌ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హీరో ఆయుష్మాన్‌ ఖురానా మాట్లాడుతూ, ‘మాడాక్‌ ఫిల్మ్స్‌ హర్రర్‌ కామెడీ యూనివర్స్‌లో వస్తున్న నెక్స్ట్‌ చాప్టర్‌ ‘థామా’. బేతాళ్‌కి హెడ్‌ థామా. రష్మికతో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కాన్సెప్ట్‌ ఆడియన్స్‌ని అలరిస్తుంది. ఫస్ట్‌ టైం యాక్షన్‌ చేశాను. ఇలాంటి క్యారెక్టర్‌ చేయడం నాకు చాలా కొత్తగా అనిపించింది’ అని తెలిపారు. ‘ఇందులో కథకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పర్ఫార్మెన్స్‌లు అమేజింగ్‌గా ఉంటాయి. ఈ యూనివర్స్‌కి ఆడియన్స్‌ నుంచి చాలా మంచి ఆదరణ ఉంది. ప్రతి సినిమాకి ఒక కొత్త క్యారెక్టర్‌ చేయాలని ప్రయత్నిస్తుంటాను. ఈ సినిమాతో కూడా ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్‌ చేస్తానని భావిస్తున్నాను. ఈ సినిమా మిమ్మల్ని కచ్చితంగా ఎంటర్‌టైన్‌ చేస్తుందనే నమ్మకం ఉంది’ అని హీరోయిన్‌ రష్మిక మందన చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -