బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు..
నవతెలంగాణ – మణుగూరు
కల్వకుంట్ల కవిత ను బి ఆర్ ఎస్ నుండి సస్పెండ్ చేయడం కెసిఆర్ నిర్ణయం చారిత్రాత్మకమని బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. కొద్దిరోజులుగా కవిత చేసిన పనుల వలన పార్టీ ప్రతిష్ట దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాంటి సందర్భంలో పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ప్రాణత్యాగం చేసిన మహానేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పూర్తిగా సమయోచితమైందే కాకుండా చరిత్రలో నిలిచిపోయేంత గొప్పదని మనం స్వాగతిస్తున్నాం అని తెలిపారు.
బీఆర్‌ఎస్ అంటే కేవలం ఒక కుటుంబ పార్టీ కాదని, ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని ఆయన స్పష్టం చేశారు. 60 లక్షల మంది సైనికులు, నాయకులు, కార్యకర్తలు ఉన్న బలమైన సైన్యం ఇది అని అన్నారు వారి భవిష్యత్తు కోసం కన్నకూతురి మీద కూడా నిర్ణయం తీసుకోవడం కేసీఆర్ ధైర్యసాహసాలకు నిదర్శనమని కాంతారావు పేర్కొన్నారు. తప్పు చేస్తే కుటుంబ సభ్యులనైనా సహించను అని గతంలో కేసీఆర్ చెప్పిన మాటలకు ఈ నిర్ణయం అద్దం పట్టింది. పార్టీ కంటే ఎవ్వరూ పెద్దవారు కారనే విషయం మరొకసారి నిరూపితమైంది. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైన కేసీఆర్ పార్టీ కోసం కన్నబిడ్డను కూడా వదులుకున్న అరుదైన నాయకుడు అని అన్నారు. జిల్లా వ్యాప్తంగా రేగా కాంతారావు ఈ వ్యాఖ్యలు కార్యకర్తలలో విశేష ఉత్సాహం నింపాయి.
కవిత సస్పెన్షన్ చారిత్రాత్మకం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES