ఎంఆర్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
వికలాంగులకు, చేయూత పెన్షన్ దారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు రూ.6000 చేయూత పెన్షన్ దారులకు రూ.4000 పెన్షన్ పెంచి ఇవ్వాలని, కండరాల క్షీణతతో పూర్తిగా మంచానికి పరిమితమైన వికలాంగులకు రూ.15వేల పెన్షన్ ఇవ్వాలని లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రత్యక్ష యుద్ధం చేస్తామని ఎంఆర్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ హెచ్చరించారు.
ఈ నెల 15 వ తేదీన మండల రెవెన్యూ కార్యాలయాల దిగ్బంధనంన విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు పెంచి ఇచ్చేవరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రత్యక్ష యుద్ధం చేయడం కోసం వేలాదిమంది వికలాంగులు మరియు చేయూత పెన్షన్ దారులతో ఎమ్మార్వో కార్యాలయాలను వేలాదిమంది పెన్షన్ దారులతో దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు.
ప్రతి గ్రామంలో ఉన్న వికలాంగులు మరియు చేయూత పెన్షన్ దారులు మందకృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీతో ప్రత్యక్ష యుద్ధం చేయడం కోసం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మొండి వైఖరి మార్చుకొని వికలాంగులకు చేయూత పెన్షన్ దారులకు పెన్షన్ పెంచి ఇవ్వాలని మరియు నూతన పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.