మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్
నవతెలంగాణ – మల్హర్ రావు
గ్రామీణ ప్రాంతాల్లోని ఎంతో మంది క్రీడాకారులుంటారని అలాంటి వారిలోని క్రీడానైపుణ్యం, ప్రతిభను గుర్తించాల్సిన అవసరం ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. కాటారం మండలం ధన్వాడ గ్రామంలో నిర్వహించిన ధన్వాడ ప్రీమియర్ లీగ్-10లో పాల్గొన్న గారెపల్లి క్రికెట్ అసోసియేషన్ టీమ్ కు భీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు రామ్మిళ్ల కిరణ్, మల్హర్ రావు మండల మహీ-333 డిసైడర్స్ టీమ్ కి త్రిశూల్ విజినరీ స్టూడియోస్ స్పాన్సర్స్ చేసిన టీ షర్ట్‌లను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం ద్వారా ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు. ప్రతిభను గుర్తించాలంటే ఇలాంటి గ్రామీణ క్రీడలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, ఇలాంటి క్రీడల నిర్వహణకు తనవంతు సహకారం అందిస్తానని స్పష్టం చేశారు. ప్రతి క్రీడాకారుడు గొప్పగా ఆడి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయికి ఎదుగాలని ఆయన ఆకాంక్షించారు.
గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES