Tuesday, October 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అల్లుకున్న నిర్లక్ష్యం..

అల్లుకున్న నిర్లక్ష్యం..

- Advertisement -

ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా?
చోద్యం చూస్తున్న విద్యుత్ అధికారులు 
నవతెలంగాణ -పెద్దవంగర
మండల నడిబొడ్డున విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, తీగలకు పూర్తిగా పచ్చదనం అల్లుకుని, అత్యంత ప్రమాదం పొంచి ఉంది. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి వెళ్లే దారిలో, సెల్ టవర్ సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, స్థంబాలు, తీగలను చెట్ల కొమ్మలు, పిచ్చిమొక్కలు చుట్టేశాయి. వర్షాలు పడినపుడు తీగ మొక్కలకు విద్యుత్ సప్లయ్ కావడం వల్ల పశువులు చనిపోయే ప్రమాదం ఉంది. దీంతో తరచుగా విద్యుత్ సరఫరాలో అంతరాయం తో పాటు, ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం వర్ష కాలం నేపథ్యంలో విద్యుత్ సరఫరాపై అప్రమత్తంగా ఉండాల్సిన విద్యుత్ అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తని విధంగా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్ సరఫరాలో నష్టాలను నివారించేందుకు కరెంట్ స్తంభాలు, విద్యుత్ తీగల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలు పెరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. కానీ ఈ విషయంలో పెద్దవంగర విద్యుత్ శాఖ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా మండల కేంద్రంలోని డబుల్ బెడ్ రూం సమీపంలో హైటెన్షన్ విద్యుత్ తీగలు చేతికందే ఎత్తులో ఉన్నాయి. గత నెల రోజులుగా స్థానికులు విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడం లేదని, ప్రమాదం జరిగితేనే పట్టించుకుంటారా అని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -