- Advertisement -
- – ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు భయాందోళన..
– వాటర్ లీకేజీ తో నీటి వృధా.. - – అధికారుల పర్యవేక్షణ లేని వైనం..
నవతెలంగాణ-గండీడ్
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని సాలార్ నగర్ గ్రామంలో ఉన్న పురాతన వాటర్ ట్యాంక్ పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. ట్యాంక్ మొత్తం పెచ్చులు ఊడిపోయి పడిపోయేందుకు సిద్ధంగా ఉన్నది.లీకేజీల వలన ట్యాంకు నుండి నీరు కారుతుంది,లీకేజీ వలన నీటి వృధా అవుతుందని,శిథిలమైన ట్యాంకు వలన నీటిలోకి మలినాలు చేరుతున్నాయని, కలుషితమైన నీరు తాగడం వలన చర్మంపై దురదలు ఏర్పడుతున్నాయని,ఈ ట్యాంక్ సమీపంలో అమ్మవారి ఆలయం ఉన్నది.అలాగే ఈ ట్యాంక్ పక్కనుంచే పొలాలకురహదారి ఉన్నది.ఈ రహదారిపై రైతులు పొలం పనులకోసం తిరుగుతూ ఉంటారు.నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయం,ట్యాంక్ పక్కనే ఖాళీ స్థలం ఉండడంతో చిన్నపిల్లలు కూడా ఈ ప్రదేశంలో ఆటలు అడుకుంటూఉంటారు.నిత్యం జనసంచారం మధ్యన ఉండే ట్యాంక్ శిథిలావస్థకు చేరినప్పటికీ అధికారులు ట్యాంక్ తీసివేసేందుకు చర్యలు చేపట్టడం లేదు. వర్షాకాలం కావడంతో ఎప్పుడు కూలుతుందోనని స్థానికులు భయాందోళనలను వ్యక్తం చేస్తున్నారు.అధికారులు స్పందించి ,పాత ట్యాంకును తొలగించి కొత్త ట్యాంకును ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
- Advertisement -