Wednesday, August 6, 2025
E-PAPER
Homeఖమ్మం45 వేల ఎకరాలు సాగు విస్తీర్ణం లక్ష్యం...

45 వేల ఎకరాలు సాగు విస్తీర్ణం లక్ష్యం…

- Advertisement -

త్వరితగతిన గెలలు గానుగ ఆడాలి…
పది పరిశ్రమలు స్థాపించే అవకాశం..
సిబ్బంది భర్తీకి సీఎం సుముఖం..
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం ఆయిల్ ఫెడ్ పరిధిలో 8 జిల్లాల్లో 45000 ఎకరాల్లో పామాయిల్ సాగు విస్తీర్ణం లక్ష్యం పెట్టుకున్నాం అని దానికి అనుగుణంగా కార్యాచరణ చేపడుతున్నాం అని ఆయిల్ ఫెడ్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన స్థానిక ఆయిల్ఫెడ్ పరిశ్రమను నెలవారీ సందర్శనలో భాగంగా సాదారణ సందర్శన చేసారు.పరిశ్రమ,పవర్ ప్లాంట్ లను ఆయన క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం నవతెలంగాణ తో మాట్లాడారు.

ఇప్పటికే నిల్వ ఉన్న సుమారు 700 మెట్రిక్ టన్నుల గెలలు ను త్వరితగతిన గానుగ ఆడాలని పరిశ్రమ మేనేజర్ ను ఆదేశించారు.సంస్థలో ఖాలీ లు ఉన్న సిబ్బంది భర్తీకి సీఎం రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేసారని,ఈ క్రమంలో త్వరలో అవసరం అయిన సిబ్బందిని భర్తీ చేస్తామని అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి పది జిల్లాల్లో ఒక్కోటి చొప్పున పామాయిల్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పాలని ఉద్దేశంలో ఉన్నారని తెలిపారు.

త్వరలో విత్తనాలు తెప్పించి 10 లక్షల వరకు పామాయిల్ మొక్కలు పెంచుతామని‌  తెలిపారు.పవర్ ప్లాంట్ సామర్థ్యం మించి విద్యుత్ ఉత్పత్తి చేయడం పై హర్షం వ్యక్తం చేసారు. ఆయన వెంట పీ అండ్ పీ మేనేజర్ జే.సత్యనారాయణ,పరిశ్రమ మేనేజర్ నాగబాబు,ఏఈఈ పవన్,ఫోర్ మేన్ గోపాల క్రిష్ణ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -