Saturday, July 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి

- Advertisement -

– జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి సాయ గౌడ్ 
– మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ఆయా పథకాలలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి సాయ గౌడ్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో మండలంలో వివిధ పథకాల అమలు తీరుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనితీరును ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో వన మహోత్సవం కార్యక్రమం జరుగుతున్న తీరుపై సమీక్షించారు. అనంతరం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారి, మండల ప్రత్యేక అధికారి సాయ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోగా మొదటి విడత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఇండ్ల నిర్మాణాల్లో వేగం పెంచేలా లబ్ధిదారులకు, సంబంధిత మేస్త్రీలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వన మహోత్సవంలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయాలన్నారు. సేకరించిన స్థలాల్లో మొక్కలు నాటించి వాటి సంరక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వర్షాలు కురుస్తున్నందున గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా దోమల నివారణ చర్యల్లో భాగంగా మురికి కాలువలు, నీటి నిల్వ గుంతలు, తదితర ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, ఆయిల్ బాల్స్ వేయించాలని ఎంపీడీవోకు సూచించారు. ఆరోగ్యశాఖ సిబ్బంది  మంగళవారం, శుక్రవారం డ్రైడే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా దోమల వృద్ధి వల్ల కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. మండలంలో అమలవుతున్న వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై ఆయన సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్ష సమావేశంలో తహసిల్దార్ గుడిమెల ప్రసాద్, ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారిణి  ,ఆర్టికల్చర్ అధికారి రాజా గౌడ్, మండల వైద్యాధికారి, కమ్మర్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ నరసింహ స్వామి, చౌటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ స్పందన, హౌసింగ్ ఏఈ రాకేష్, ఇరిగేషన్ ఏఈ సుమన్, ఐసిడిఎస్ మండల పర్యవేక్షకురాలు గంగ హంస, మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -