Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది..

ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది..

- Advertisement -

జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం 
నవతెలంగాణ – నసురుల్లాబాద్ 

ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది, గౌరవ ప్రదమైనదని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఇంటర్ బోర్డు కామారెడ్డి జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం అన్నారు. గురువారం బీర్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలో సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇంటర్ బోర్డు జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా నోడల్ అధికారి సలాం మాట్లాడుతూ, కనిపించే దైవంగా ఎంతో మంది సామాన్యులను గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దిన ఘనత గ్రామీణ ఉపాధ్యాయులదేనన్నారు

. నవసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల, లెక్చరర్ల  ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు. విలువలతో కూడిన విద్యనందించడంతో పాటు భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో మందుకు సాగాలని ఆయన ఉపాధ్యాయులకు, లెక్చరర్ లకు సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు ఎంతో ముఖ్యమని, వారిలో ఆ నమ్మకాన్ని కలిగించేలా ఉపాధ్యాయులు, లెక్చరర్లు విద్యా వ్యవస్థ ముందుకు సాగేలా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా నోడల్ అధికారి షేక్ సలాం సార్ గారు పాల్గొనడం జరిగింది. షేక్ సలాం సార్  మాట్లాడుతూ లెక్చరర్స్ గా బోధించిన విద్యార్థులను అభినందిస్తూ ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి అని పిల్లలందరూ మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో యాద గౌడ్ సర్ సత్తన్న సార్ , రంజిత్ సార్, దేవి సింగ్ సర్ నారా గౌడ్ సార్ సౌమ్య మేడం సతీష్ సార్ సుభాష్ సర్ బాలకిషన్ సర్ రాకేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -