- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నటుడు విశాల్ ఆదివారం విల్లుపురంలో జరిగిన మిస్ కూవగం 2025 కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక్కసారిగా వేదికపై కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. దీనితో ఆయన ఆరోగ్యంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. అయితే, విశాల్ టీమ్ తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టతనిచ్చింది. విశాల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. వడదెబ్బ లేదా అలసట కారణంగా ఆయన అస్వస్థతకు గురయ్యారని ప్రాథమికంగా భావిస్తున్నారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, త్వరలోనే పూర్తి ఆరోగ్య సమాచారం తెలియజేస్తామని వారు పేర్కొన్నారు.
- Advertisement -