Wednesday, September 17, 2025
E-PAPER
Homeజిల్లాలుతెలంగాణ సాయుధ పోరాటం గొప్పది..

తెలంగాణ సాయుధ పోరాటం గొప్పది..

- Advertisement -

-మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి

-ప్రజా పాలన దినోత్సవంలో జాతీయ జెండావిష్కరణ 

నవతెలంగాణ-బెజ్జంకి

దొరల దోపిడీ, బానిసత్వం నుండి ప్రజలకు విముక్తి కలిగించిన తెలంగాణ సాయుధ పోరాటం గొప్పదని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి కొనియాడారు. ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయ అవరణం వద్ద బుధవారం మండలాధ్యక్షుడు రత్నాకర్ రెడ్డి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి జాతీయ జెండావిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చేల రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని రత్నాకర్ రెడ్డి అన్నారు.ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ,వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, కార్యనిర్వాహణ మండలాధ్యక్షుడు అక్కరవేణీ పోచయ్య, ఆలయ చైర్మన్ ప్రభాకర్, యువజనాధ్యక్షుడు సందీప్, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య,నాయకులు భైర సంతోష్ ,చెన్నారెడ్డి, ఐలేని మహేందర్ రెడ్డి, శీలం నర్సయ్య, ఏఎంసీ డైరెక్టర్లు తదితరులు హజరయ్యారు.

పీఏసీఎస్ వద్ద..

ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద చైర్మన్ తన్నీరు శరత్ రావు జాతీయ జెండావిష్కరించారు. సీఈఓ శ్రీనివాస్,సిబ్బంది బుచ్చయ్య, అనిల్,బాను ప్రసాద్,మల్లేశం పాల్గొన్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో..

ప్రజా పాలన దినోత్సవం సందర్బంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అయా గ్రామాల పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేకాధికారులు జాతీయ జెండావిష్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -