– డిజిటల్ దుష్ప్రచారాన్ని అడ్డుకునే మార్గాలపై చర్చలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సోషల్‌మీడియా దుష్ప్రచారాన్ని అడ్డుకునే అంశంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సి.సుదర్శన్‌రెడ్డి యూరోపియన్ పార్లమెంట్ డైరెక్టర్ జనరల్ క్రిస్టియన్ మాంగోల్డ్‌తో మంగళవారం కీలక భేటీ నిర్వహించారు. ఈయూ ఎన్నికల వ్యవస్థ నిర్మాణం, ప్రజలతో కమ్యూనికేషన్ నిర్వహించే విధానం, ఫేక్ న్యూస్ వ్యాప్తిని నియంత్రించేందుకు యూరోపియన్ యూనియన్ తీసుకుంటున్న సాంకేతిక, విధానపరమైన చర్యలను మాంగోల్డ్ వివరించారు. డిజిటల్ వేదికలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని గుర్తించి తక్షణమే స్పందించే ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థల గురించి ఆయన ప్రస్తావించారు. వద్ధులు, దివ్యాంగులు, వలస ఓటర్లు వంటి వర్గాలకు సులభంగా ఓటు హక్కు వినియోగించేలా భారత ఎన్నికల సంఘం అమలు చేస్తున్న నూతన కార్యక్రమాలపై సీఈవో సుదర్శన్‌రెడ్డి అవగాహన కల్పించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిర్వహిస్తున్న ఎన్నికల తీరుపై మాంగోల్డ్ ప్రశంసలు వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నికల నిర్వహణలో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయడం, డిజిటల్ యుగంలో ఎన్నికల విశ్వసనీయతను పరిరక్షించడమే లక్ష్యంగా సీఈవో నేతత్వంలోని తెలంగాణ బందం యూరప్ పర్యటనలో భాగంగా ఈ భేటీ జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
యూరోపియన్ పార్లమెంట్ డీజీతో తెలంగాణ సీఈవో భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



