Saturday, July 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతీపి క‌బురు చెప్పిన తెలంగాణ ప్ర‌భుత్వం

తీపి క‌బురు చెప్పిన తెలంగాణ ప్ర‌భుత్వం

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్: దివ్యాంగులు ఆర్థిక స్వావలంబన పొంది ఇతరుల మాదిరి సాధారణ జీవనం గడపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు , వయోవృద్ధుల సంక్షేమ శాఖ ద్వారా దివ్యాంగులకు ఉపాధి పునరావాస పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా 100% సబ్సిడీతో రూ. 50,000/-లను బ్యాంకు లింకేజీలో 80%, 70% , 60% సబ్సిడీతో రూపాయలు 1,00,000/-, 2,00,000/- , 3,00,000/-ల వరకు 2025-26 ఆర్థిక సంవత్సరమునకు కరీంనగర్ జిల్లాకు 21 యూనిట్లు మంజూరు చేస్తారు. తేదీ 14-07-2025 నుండి 31-07-2025 వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కావున అర్హులైన దివ్యాంగులు https://tgobmms.cgg.gov.in/ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనగలరని కోరడమైనది.
ఎవరు అర్హులు
కనీసం దివ్యాంగత్వం 40% శాతం పైన ఉండాలి. 21 నుండి 55 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. ఆదాయ పరిమితి: రూ.1.5 లక్షల లోపు – గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో రూ. 2.00 లక్షల లోపు ఉన్నవారు అర్హులు. అభ్యర్థులు గత 5 సంవత్సరాలలో మహిళలు, పిల్లలు, వికలాంగులు , వయో వృద్ధుల శాఖ, కరీంనగర్ లేదా మరే ఇతర శాఖ లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థ నుండి సబ్సిడీ పొంది ఉండకూడదు. తదుపరి జిల్లా స్థాయి సెలెక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేస్తారని యం. సరస్వతి జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -