Friday, September 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చరిత్రలో లిఖించదగినది తెలంగాణ రైతాంగ సాయుధ  పోరాటం..

చరిత్రలో లిఖించదగినది తెలంగాణ రైతాంగ సాయుధ  పోరాటం..

- Advertisement -

సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరినర్సింహ్మ…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

భువనగిరి మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలో గల కామ్రేడ్ రావి నారాయణరెడ్డి స్తూపం వద్ద తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్బంగా రామన్నపేట సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించి, మాట్లాడారు. భూమి కోసం ,భుక్తి కోసం  తెలంగాణ ప్రజల విముక్తి కోసం జరిగిన గెరిల్లా యుద్ధ చరిత్ర ను, నేడు కేంద్ర ప్రభుత్వ బిజేపీ పార్టీ వక్రీకరిస్తూ హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటం గా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని,  చరిత్రను చదివితె,  తిరగ వెస్తే  అందరికి తెలుస్తుందని,  మీరు నమ్మిస్తె నమ్మరని గుర్తుంచుకోవాలని అన్నారు, చరిత్ర ఒకరకంగా ఉన్నప్పుడు,  మీ రాజకీయాల కోసం వేరేలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తె ప్రజలు  తిరగబడతారని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

తెలంగాణ సాయుధ పోరాటాన్ని  ప్రభుత్వం పాఠ్యాంశంలో చేర్చి ప్రజలకు, ఇప్పటి యువతకు తెలిసేలా చేయాలన్నారు, తెలంగాణ సాయుధ పోరాటంలో  4500 మంది  యువ కమ్యూనిస్టులు ప్రాణత్యాగం చేసారని,  మూడువేల గ్రామాలకు విముక్తి కలిపించారని,  10వేల ఎకరాల  భూములను  పేదలకు పంచిన ఘనత  కమ్యూనిస్టుల దని  గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వం సెప్టెంబర్  17 వ తేదిని విలీన దినోత్సవాన్ని అధికారికంగా జరిపించాలని కోరారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు బాలగోని మల్లయ్య,  గంగాపురం వెంకటయ్య,  గాలయ్య, ఊట్కూరి కృష్ణ,   పెండెం రవీందర్,  ఏనూతుల రమేష్,  చిందెం మల్లేష్,  పల్లే మల్లేష్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -