Saturday, December 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఫిబ్రవరి 7,8 తేదీల్లో తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్‌

ఫిబ్రవరి 7,8 తేదీల్లో తెలంగాణ సాహితి లిటరరీ ఫెస్ట్‌

- Advertisement -

పోస్టర్‌ ఆవిష్కరించిన సుద్దాల అశోక్‌తేజ, జయరాజ్‌
నవతెలంగాణబ్యూరో – హైదరాబాద్‌ / ముషీరాబాద్‌

తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7,8 తేదీల్లో హైదరాబాద్‌ దోమల్‌గూడలోని ఏవీ కాలేజీలో లిటరరీ ఫెస్ట్‌ జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌లో ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, ప్రకృతి కవి జయరాజ్‌ ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి కె ఆనందాచారి మాట్లాడుతూ ఫిబ్రవరి 7,8 తేదీల్లో తెలంగాణ సాహితి దశాబ్ది సాహిత్యో త్సవాలు జరుగుతాయని వివరించారు. సుద్దాల అశోక్‌తేజ, జయరాజ్‌ మాట్లా డుతూ ఈ దశాబ్దంలో రాష్ట్రంలో వచ్చిన సాహిత్యాన్ని గ్రంథస్తం చేస్తూ తెలం గాణ సాహితి ప్రత్యేక సంచికను తేవడం గొప్ప విషయమన్నారు. అకాడమి కార్యదర్శి నామోజు బాలాచారి మాట్లాడుతూ తెలంగాణ సాహితి యువతకు అధిక ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. లిటరరీ ఫెస్ట్‌ను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బుక్‌ఫెయిర్‌ అధ్యక్షులు, కవి యాకూబ్‌, కార్యదర్శి ఆర్‌ వాసు, కేంద్ర సాహిత్య అకాడమి యువ పురస్కార గ్రహీతలు మోర్సీ మార్గరేట్‌, తగుళ్ల గోపాల్‌, తెలంగాణ సాహితి నాయకులు అనంతోజు మోహన్‌కృష్ణ, ఏబూషీ నర్సింహ, శరత్‌ సుదర్శి, యువ కవులు, రచయితలు తండ హరీశ్‌గౌడ్‌, బండారు రాజ్‌ కుమార్‌, శ్రీనివాస్‌గౌడ్‌, పేర్ల రాము,రూప్‌కుమార్‌ డబ్బీకార్‌ తదితరులున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -