Tuesday, February 3, 2026
E-PAPER
Homeజిల్లాలుయాద‌గిరిగుట్ట‌లో ప‌దో వార్డు ఏక‌గ్రీవం

యాద‌గిరిగుట్ట‌లో ప‌దో వార్డు ఏక‌గ్రీవం

- Advertisement -

ఏక‌గ్రీవ‌మైన కాంగ్రెస్ చైర్‌ప‌ర్స‌న్ అభ్య‌ర్థి గుండ్ల‌ప‌ల్లి వాణీ భ‌ర‌త్‌గౌడ్‌
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 

యాద‌గిరిగుట్ట మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవాలు ప్రారంభ‌మ‌య్యాయి. చివ‌రి నిమిషంలో 10వ వార్డుకు చెందిన‌ బీఆర్ఎస్ అభ్య‌ర్థి ఆవుల మ‌మ‌త సాయి నామినేష‌న్‌ను ఉప‌సంహ‌రించుకున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్య‌ర్థి గుండ్ల‌ప‌ల్లి వాణీ భ‌ర‌త్‌గౌడ్ ఏక‌గ్రీవ‌మ‌య్యారు. ప‌దో వార్డులో రెండు నామినేష‌న్లు దాఖ‌లు కాగా బీఆర్ఎస్ అభ్య‌ర్థి ఆవుల మ‌మ‌త సాయి విత్‌డ్రా చేసుకోవ‌డంతో వాణీ భ‌ర‌త్ గౌడ్ ఏక‌గ్రీవమ‌య్యారు. గుండ్లపల్లి వాణీ భరత్ గౌడ్‌ను ఇప్పటికే యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్ర‌క‌టించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -