Wednesday, September 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రేపటితో ముగియనున్న సహకార పాలకవర్గ పదవీకాలం

రేపటితో ముగియనున్న సహకార పాలకవర్గ పదవీకాలం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
ఉమ్మడి జిల్లాలో గల సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం రేపటితో ముగిస్తుంది. గత ఫిబ్రవరి 19వ తేదీతో పాలకవర్గాల పదవీకాలం ముగియగ, ఆరు నెలలపాటు పొడిగించినారు. దీంతో నేటితో గడువు ముగుస్తుంది.

జిల్లాలో 89 సంఘాలు..
జిల్లాలో మొత్తం 89 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో పాలకవర్గాలు కొనసాగుతున్నాయి. ఈ పాలకవర్గాలైన చైర్మన్లు డైరెక్టర్ల పదవీకాలం నేటితో ముగిస్తుంది. సహకార సంఘాల పరిధిలో ఐదేళ్లపాటు చైర్మన్లు, డైరెక్టర్లు కొనసాగారు. నేటితో మరో ఆరు నెలలు సైతం కొనసాగినారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో రైతులకు రుణాలు ఇవ్వడంతో పాటు ఎరువుల పంపిణీ చేపట్టారు. సహకార సంఘాల చట్టం ప్రకారం సభ్యుల పదవీకాలం ముగిస్తున్న నెలరోజుల ముందే ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇవ్వాలి. సహకార  సంఘాల పరిధిలో ఎన్నికల నిర్వహణ చేపట్టాలి.

ఈ ఎన్నికలపై ప్రభుత్వం ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నందున ప్రభుత్వం వీటి పైనే ఇంకా దృష్టి పెట్టలేదు. కామారెడ్డి జిల్లాలో 55 సహకార సంఘాలు  ఉన్నవి. రేపు నిర్వహించే స్వతంత్ర దినోత్సవ వేడుకలలో జెండా ఎగురవేసే అవకాశం ఉంటుందా లేదా అని అధ్యక్షుల్లో ఆసక్తి నెలకొంది. కాగా జిల్లాలోని మెజారిటీ సహకార సంఘాల చైర్మన్లు మాత్రం పూర్తిస్థాయి పాలకవర్గాలకు పొడిగింపు వస్తుందని వేచి చూస్తున్నారు. గతంలో కూడా ఇదే రీతిలో సంఘాలకు పొడగింపు ఇచ్చారని  పలువురు చైర్మన్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -