Tuesday, April 29, 2025
Navatelangana
Homeజిల్లాలుపహల్గాంలో ఉగ్రదాడి కిరాతకమైన చర్య

పహల్గాంలో ఉగ్రదాడి కిరాతకమైన చర్య

  • ఆత్మకు శాంతి కలగాలని క్రొవ్వొత్తు లతో ర్యాలీ , నిరసన 
  • నవతెలంగాణ  – చండూరు
    జమ్ము కాశ్మీర్ లోని పహల్గాంలో అత్యంత క్రూరంగా దాడి చేసి 28మంది భారత పౌరులను చంపేయడం అత్యంత కిరాతకమైన చర్య అని ఆర్యవైశ్య సంఘం నల్గొండ  జిల్లా అధ్యక్షుడు తేలుకుంట్ల  చంద్రశేఖర్  అన్నారు. పహల్గాంలో అమాయక హిందూ సోదరులపై ఉగ్రదాడిని పాశావీక, అనాగరికమైన చర్యగా పేర్కొంటూ తీవ్రంగా ఖండించారు.  సోమవారం స్థానిక చౌరస్తాలో పహల్గాంలో  ఉగ్రవాదుల దాడి కి నిరసన, మృతుల కు ఆత్మ శాంతి కోరుకుంటూ క్రొవ్వొత్తు లతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  జమ్మూ కాశ్మీర్ అందాలను చూసేందుకు దేశ విదేశాల నుండి కుటుంబాలతో వస్తారన్నారు. అలాంటి ప్రదేశంలో మానవత్వం మరిచిన మతపిశాచకులు చేసిన దాడిని తమ ఆర్యవైశ్య సంఘం   తీవ్రంగా ఖండిస్తుందన్నారు.  సాధారణ పర్యాటకులే లక్ష్యంగా ఆర్మీ యూనిఫాంలో వచ్చి మతం అడిగి మరీ కాల్పులు జరిపి, దొరికిన వాళ్లను దొరికినట్లు పిట్టలను కాల్చినట్టు, కాల్చి మరణహోమం చేసిన మత ఉన్మాదుల చర్యలను పిరికిపంద చర్యగా అభివర్ణిస్తున్నామన్నారు. 28మంది పౌరులు ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఉగ్రముఖలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమాయకులపై ఉగ్రవాదుల దాడిని యావత్ భారత్ ముక్తకంఠంతో ఖండిస్తోందన్నారు.ఈ  కార్యక్రమంలో తేలుకుంట్ల శ్రీనివాస్, జానయ్య , మంచుకొండ చిన్న బిక్షమయ్య, సముద్రాల వెంకటేశ్వర్లు,తాటిచెట్టి వెంకన్న, తాడిశెట్టి గంగాధర్,తడకమళ్ళ శ్రీధర్, గాంధీ, తడకమళ్ళ వెంకన్న, బండారు నాగేశ్వరరావు, కర్నాటి శ్రీనివాస్, రమేష్, తాడిశెట్టి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు