Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మూడవ విడత ప్రచారానికి నేటితో తెర.!

మూడవ విడత ప్రచారానికి నేటితో తెర.!

- Advertisement -

కాటారం డివిజన్లో ఈనెల 17న పోలింగ్
నవతెలంగాణ – మల్హర్ రావు

మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారానికి సోమవారం తెర పడనుంది. కాటారం డివిజన్ పరిధిలోని మల్హర్, కాటారం, మహముత్తరం, మహాదేవపూర్ మండలాల్లో ఈనెల 17న పోలింగ్ జరుగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలింగ్ సమయానికి 48గంటల ముందే ప్రచారం నిలిపివేయాల్సి ఉంటుంది. కాగా నామినేషన్ల దాఖలు, ఉపసంహరణల తర్వాత ఎన్నికలు జరుగనున్న గ్రామాల్లో వారం రోజుల పాటు ప్రచార హడావుడి సాగింది. సోమవారం 5 గంటలకు ప్రచారం ముగించాల్సి ఉంటుంది.5 మండలాల్లో ఎన్నికలు ఈనెల 17న జరుగనున్న పల్లెపోరుకు అధికారులు సమాయత్తం అయ్యారు.

కాటారం డివిజన్ లో మొత్తం 25 క్లస్టర్లలో 81 గ్రామ పంచాయతీలు,696 వార్డులకు,మండలంలో మొత్తం 15 జిపిలు,128 వార్డులు ఉండగా చిన్నతూoడ్ల,దుబ్బపేట జిపిలు,26 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం 13 జిపిలకు 42 మంది,102 వార్డులకు 237 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు వీరికి ఎన్నికలు జరుగనున్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించగా అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డీఆర్సీ కేంద్రాల నుంచి ఎన్నికల సిబ్బంది.. సామగ్రితో పోలింగ్ ముందు రోజే ఆయా గ్రామాలకు చేరుకోనున్నారు. 17వ తేదీన ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గం ట వరకు పోలింగ్ జరుగనుండగా అనంతరం కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -