- Advertisement -
హీరో సిద్ధు జొన్నలగడ్డ తన ఆరో చిత్రానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదలైన అద్భుతమైన పోస్టర్ అందరి దష్టిని ఆకర్షిస్తోంది.
ఇదిలా ఉంటే, సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో వస్తున్న మూడో చిత్రమిది. గతంలో వీరి కలయికలో వచ్చిన ‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ సినిమాలు భారీ విజయం సాధించాయి. ఇప్పుడు వీరు హ్యాట్రిక్ కోసం సన్నద్ధ మవుతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. యువ దర్శకుడు స్వరూప్ ఆర్‌ఎస్‌జే.. కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
- Advertisement -



