Thursday, October 9, 2025
E-PAPER
Homeఆదిలాబాద్కుష్టు వ్యాధితో ముప్పు..

కుష్టు వ్యాధితో ముప్పు..

- Advertisement -

డిప్యూటీ పారామెడికల్ అధికారి సిడాం వామన్ రావు..
నవతెలంగాణ – బజార్ హాత్నూర్
కుష్టు వ్యాధిని దాచుకుంటే ముప్పు కలుగుతుందని డిప్యూటీ పారా మెడికల్ అధికారి వామన్ రావు అన్నారు. మండలంలోని గిరిజాయి గ్రామంలో గురువారం కుష్టు వ్యాధి అనుమానితులకు నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇందులో భాగంగా ఇద్దరికి కుష్టు వ్యాధి సోకినట్లు నిర్ధారణ చేసి మందులను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ .. కుష్టు వ్యాధిని ఎండిటి చికిత్సతో ఏ దశలోనైనా నయం చేయవచ్చని తెలిపారు.

ప్రజలు ఈ వ్యాధి పట్ల భయాన్ని వీడి అనుమానిత లక్షణాలు ఉన్నట్లయితే ఆశా కార్యకర్తలు గాని సమీపంలోని వైద్య సిబ్బందిని గాని సంప్రదించాలని సూచించారు. ప్రాథమిక దశలో గుర్తించినట్లయితే ఎలాంటి అంగవైకల్యం కలగదనిసూచించారు పేర్కొన్నారు. వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడేలా చూడాలని ఆశా కార్యకర్తకు సూచించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ఆశా కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆశా కార్యకర్తలకు కుష్టు వ్యాధిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిపిఎమ్ఓ రమేష్, హెచ్ఈఓ సూర్య ప్రకాష్, హెల్త్ అసిస్టెంట్ గాజుల రమేష్, ఆశా కార్యకర్త సునీత, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -