Friday, November 28, 2025
E-PAPER
Homeతాజా వార్తలుథ్రిల్‌ చేసే 'వానర'

థ్రిల్‌ చేసే ‘వానర’

- Advertisement -

అవినాశ్‌ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయ మవుతున్న సినిమా ‘వానర’. సిమ్రాన్‌ చౌదరి హీరోయిన్‌. నందు ప్రతినాయకుడిగా కనిపించ నున్నారు. శంతను పత్తి సమర్పణలో సిల్వర్‌ స్క్రీన్‌ సినిమాస్‌ బ్యానర్‌ పై అవినాశ్‌ బుయానీ, ఆలపాటి రాజా, సి.అంకిత్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో మంచు మనోజ్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు శంతను పత్తి మాట్లాడుతూ,’సినిమా బాగా వచ్చింది. మీరంతా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’ అని తెలిపారు. ‘పెద్ద సినిమాకు పెట్టాల్సిన టైటిల్‌ ఇది. ఈ టైటిల్‌ ఈ సినిమాను పెద్ద రేంజ్‌కు తీసుకెళ్తుంది. అవినాశ్‌ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడు. ఇండస్ట్రీకి ఇలాంటి చిత్రాలు అవసరం’ అని డైలాగ్‌ రైటర్‌ సాయిమాధవ్‌ బుర్రా చెప్పారు. హీరో, డైరెక్టర్‌ అవినాశ్‌ తిరువీధుల మాట్లాడుతూ,’నేను యాక్టర్‌ కావాలనేది మా నాన్న కల. ఈ రోజు ఆ కల తీరింది. ఇంత మంచి ఔట్‌ పుట్‌ వచ్చిందంటే కారణం మా టీమ్‌.

నా నలుగురు ప్రొడ్యూసర్స్‌ శంతను, అవినాశ్‌, ఆలపాటి రాజా, అంకిత్‌ అండగా నిలబడ్డారు. వానరుడి లాంటి హీరో తనకు ఇష్టమైన బైక్‌ను రావణుడి లాంటి విలన్‌ తీసుకెళ్లిపోతే ఆ బైక్‌ను తిరిగి తెచ్చుకునేందుకు ఎంతవరకు వెళ్లాడు?, ఎలాంటి ఫైట్‌ చేశాడు అనేది ఈ చిత్ర కథాంశం. ఈ కథ అనేక మలుపులు తిరుగుతూ థ్రిల్‌ పంచుతుంది’ అని తెలిపారు. ‘అవినాశ్‌ ఫస్ట్‌ సినిమాకే హీరోగా నటించడంతో పాటు డైరెక్షన్‌ కూడా చేశాడు. అది అంత సులువు కాదు. ఈ సినిమా చూశాను బాగా వచ్చింది. శివాజీ రాజా చేసిన సీన్స్‌ చూసి ఎమోషనల్‌ అయ్యాను. సాయం చేసే ప్రతి ఒక్కరి హృదయంలో హనుమ ఉన్నారు. మ్యూజిక్‌ మీద నాకున్న ఇష్టంతోనే ‘మోహనరాగ’ మ్యూజిక్‌ లేబుల్‌ స్టార్ట్‌ చేశాను’ అని మంచు మనోజ్‌ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -