– మూడో రోజూ సీసీ కెమెరాకు చిక్కిన వైనం
నవతెలంగాణ – కరీంనగర్
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం గంగారం తండా పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారం స్థానికులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మూడో రోజు కూడా పులి అదే ప్రాంతంలో మకాం వేయడం, అది సీసీ కెమెరా రికార్డుల్లో స్పష్టంగా కనిపించడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రెండ్రోజుల్లో ఈ పులి రెండు ఆవులను వేటాడి చంపిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి, అంతకుముందు చంపిన ఆవు మాంసాన్ని తినేందుకు పులి మళ్లీ అదే ప్రాంతానికి వచ్చింది. అటవీ శాఖ అధికారులు ముందస్తుగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో పులి కదలికలు రికార్డయ్యాయి. మంగళవారం ఉదయం అధికారులు ఈ దృశ్యాలను పరిశీలించి, పులి ఇంకా అక్కడే సంచరిస్తున్నట్టు ధృవీకరించారు.
మూడ్రోజులుగా పులి గ్రామానికి అతి సమీపంలోనే ఉండటంతో తండా వాసులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పులి గ్రామంలోకి వచ్చి మనుషులపై దాడిచేస్తే పరిస్థితి ఏంటి అని వాపోతున్నారు. అటవీ శాఖ అధికారులు పులిని పట్టుకోవడానికి లేదా అడవిలోకి పంపడానికి గట్టి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గంగారం తండాలో వీడని పెద్దపులి భయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



