టీఎస్ యూటీఎఫ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎస్సెస్సీ వార్షిక పరీక్షల షెడ్యూల్ అశాస్త్రీయంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) విమర్శించింది. ఈ మేరకు యూటీఎఫ్ అధ్యక్షులు చావ రవి, ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్ ఒక ప్రకటన విడుదల చేశారు. వెంటనే ఆ షెడ్యూల్‌ను సవరించాలని వారు డిమాండ్ చేశారు. 35 రోజుల పరీక్షల నిర్వహణతో పదవ తరగతి విద్యార్థులకు ప్రయోజనం ఉండదని అభ్యంతరం తెలిపారు. విద్యార్థుల, ఉపాధ్యాయుల, పాఠశాల ప్రయోజనాల కంటే అధికారులు తమ వ్యక్తిగత అభిప్రాయాన్ని రుద్దినట్టుగా టైంటేబుల్ ఉందని తప్పుపట్టారు. పరీక్షకు పరీక్షకు మధ్య ఒక రోజు విరామం ఇస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత షెడ్యూల్ లో నాలుగు నుంచి ఆరు రోజుల విరామం ఇవ్వడంతో విద్యార్థుల్లో ఆసక్తి తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ అధికారులు 6వ తరగతి నుంచి 9వ తరగతి గురించి కనీసస్థాయిలో దృష్టి పెట్టలేదనీ, 35 రోజులు కేవలం 10వ తరగతి పరీక్షల నిర్వహణలో ఉంటే ఇతర తరగతుల వార్షిక పరీక్షలను ఎవరు నిర్వహించాలని వారు ప్రశ్నించారు. ఉపాధ్యాయులు ఇతర తరగతుల పట్ల నిర్లక్ష్యం చేస్తూ పదవ తరగతికి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే ధోరణి పెంచడం సరికాదని చెప్పారు. కార్పొరేట్ స్కూళ్లలా జిల్లాస్థాయి ర్యాంకుల కోసం పోటీ పడి పరీక్షల్లో జిల్లా అధికారులు జోక్యం చేసుకోవడం ద్వారా పరీక్షల వ్యవస్థ స్థాయి దిగజార్చుతు న్నారని విమర్శించారు. ఇలాంటి ధోరణితో గుణాత్మక ఫలితాలకంటే పరిమా ణాత్మక ఫలితాలకు ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు. దీంతో విద్యార్థులకు పరీక్షలంటే శ్రద్ధ తగ్గిందనీ, పరీక్షల పట్ల భయం పోగొట్టి ఆసక్తిని పెంచేలా విధానాలు రూపొందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తుచేశారు.
10వ తరగతి పరీక్షల టైంటేబుల్‌ను వెంటనే సవరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



