Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కందిలోని కల్లు దుకాణాన్ని తక్షణమే తొలగించాలి 

కందిలోని కల్లు దుకాణాన్ని తక్షణమే తొలగించాలి 

- Advertisement -

కంది గ్రామస్తుల ఆందోళన
నవతెలంగాణ – కంది 

మండల కేంద్రంలోని కందిగ్రామంలో పాఠశాల సమీపంలో ఉన్నటువంటి కల్లు దుకాణాన్ని తొలగించాలని శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని మద్య నిషేధ, మద్యపాన నిషేధ అధికారి కార్యాలయంలో సూపరిండెంట్ నవీన్ చంద్ర కు కంది గ్రామ ప్రజలు వినతి పత్రం అందజేశారు.

శిశు మందిర్ స్కూల్ పక్కనే ఉన్న కల్లు దుకాణం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కల్లు దుకాణం రాత్రి  12 గంటల వరకు నడపడం వలన ఆ ప్రాంతంలో మద్యం సేవించే వ్యక్తులు ఆసంగిక కార్యకలపలకు పాల్పడుతున్నారని  గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గణపతి చౌక్ మధ్యలో ఉన్న దుకాణాన్ని తక్షణమే తొలగించాలని గ్రామస్తులు అధికారులను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -