Tuesday, July 22, 2025
E-PAPER
Homeమానవిసాంకేతిక విప్ల‌వంలో ఆమే

సాంకేతిక విప్ల‌వంలో ఆమే

- Advertisement -

నేటి మహిళలు సాంకేతిక రంగంలో తమ సత్తా చాటుకుంటున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో రీనా గుప్తా ఒకరు. టెక్నాలజీ రంగంలో వ్యాపారవేత్తగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఎప్సిలాన్‌ ఇండియాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. వెయ్యిమంది సభ్యులుగా ఉన్న బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. అంతేకాదు మహిళలను తిరిగి వర్క్‌ఫోర్స్‌లోకి తీసుకురావడంలో తన వంతు కృషి చేస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…

25 ఏండ్ల కిందట రీనా గుప్తా తన ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీని పూర్తి చేసినప్పుడు భారతదేశంలో ఐటీ విప్లవం ఊపందుకుంటున్న సమయం. విప్రోలో చేరి తన కెరీర్‌ ప్రారంభించింది. ఆ కంపెనీలో రెండేండ్లు పని చేసిన తర్వాత సాంకేతిక పనికి మించి తనకు నచ్చింది ఇంకా ఏదో ఉందని గ్రహించింది. అప్పుడే నిర్వహణ వైపు మొగ్గు చూపింది. ఇది ఆమెను ఐఐఎం లక్నోలో ఎంబీఏ చేయించింది. ఈ కీలకమైన నిర్ణయం ఆమె వృత్తిపరమైన పథాన్ని పునర్నిర్మించి. అది కాప్‌జెమినిలో నాయకత్వ స్థాయికి, ఇప్పుడు ఎప్సిలాన్‌ ఇండియాలో డిజిటల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సర్వీసెస్‌ హెడ్‌గా ఆమెను తీసుకెళ్లింది.

విశ్లేషించడం అలవాటు
అలహాబాద్‌లో పెరిగిన రీనాకు ఇంజనీరింగ్‌ పట్ల ఆసక్తి కుటుంబ ప్రభావం, సహజ అభిరుచుల కలయిక నుండి ఉద్భవించింది. ‘మా అన్నయ్య ఇంజనీరింగ్‌ చేస్తున్నాడు. నేను అతని అడుగుజాడల్లో నడవాలనుకున్నాను. చదువుకునేటపుడు గణితం, భౌతిక శాస్త్రాన్ని చాలా ఇష్టపడేదాన్ని. ఏ విషయాన్నైనా విశ్లేషించడం నాకు చిన్నతనం నుండి అలవాటు. అదే నన్ను ఇందులోకి తీసుకొచ్చింది’ అని రీనా ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో పంచుకుంది.

ఇష్టమైన స్థానానికి
ఎంబీఏ తర్వాత గుప్తా క్యాప్‌జెమినిలో చేరింది. కంపెనీలో 16 ఏండ్లు క్లయింట్‌లతో దగ్గరగా పనిచేస్తూ టెక్నాలజీ గురించి ఎంతో తెలుసుకుంది. సాంకేతికతతో పాటు వ్యాపార నైపుణ్యాలను కూడా అర్థం చేసుకుంది. ‘టెక్నాలజీలో ఎంతో నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు ఉన్నందున నిర్మాణ రంగంలోకి ప్రవేశించగలననే నమ్మకం వచ్చింది. అక్కడ వ్యాపారం గురించి మాట్లాడగలిగే వారు కూడా ఉన్నారు. నేను టెక్నాలజీ, వ్యాపారం రెండింటినీ అర్థం చేసుకోగలను. ఇదే నాకు కలిసొచ్చిన అంశం’ అని ఆమె చెప్పింది. ఆ సమయంలో భారతదేశంలో క్యాప్‌జెమినిలో వేగంగా అభివృద్ధి చెందుతున్నందున వ్యాపారం, సాంకేతికత మధ్య అంతరాన్ని తగ్గించగల నిపుణుల అవసరం చాలా కీలకంగా మారింది. ఇది రీనాకు ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌గా అవకాశాలు కల్పించింది. అక్కడ ఆమె సంక్లిష్టమైన, వ్యూహాత్మకమైన క్లయింట్‌ సంబంధాలను నిర్వహించింది. 2019లో ఆమె ఎప్సిలాన్‌ ఇండియాకు మారింది. స్ట్రాటజీ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఆమె AూAజ, మిడిల్‌ ఈస్ట్‌ అంతటా కంపెనీ మార్కెటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల కోసం గో-టు-మార్కెట్‌ వ్యూహానికి నాయకత్వం వహించింది. వ్యాపారాన్ని కోటి రూపాయాలకు పెంచింది.

వ్యూహాత్మక ఆలోచనలతో…
ఎప్సిలాన్‌ ఇండియాకు డిజిటల్‌ ఎక్స్‌పీరియన్స్‌ సర్వీసెస్‌ హెడ్‌గా ఆమె 250 మిలియన్‌ డాలర్ల గ్లోబల్‌ పోర్ట్‌ఫోలియో డెలివరీని పర్యవేక్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పని చేయగల బృందాలను నిర్మిస్తుంది. ఎప్సిలాన్‌ ఇండియాలో గుప్తా సాధించిన అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటి భారతదేశ కార్యాలయ అవగాహన, సామర్థ్యాలను మార్చడం. ‘గత రెండేండ్లలో మేము ఎదుర్కొన్న సవాళ్లలో ఒకటి భారతదేశాన్ని కేవలం డెలివరీ, అమలు కంటే ఒక అడుగు ముందు ఉంచగలగడం. ఇది ఆలోచనాత్మక నాయకత్వం, ఆవిష్కరణలను తీసుకురాగల వ్యూహాత్మక ఆలోచనను నడిపించడం కూడా. మా బృందం ఒక అడుగు ముందుకు వేసింది. ఇప్పుడు ప్రీసేల్స్‌, గో-టు మార్కెట్‌ వ్యూహాన్ని నిర్మించడం, మా క్లయింట్లకు కన్సల్టింగ్‌, సలహా సేవలను అందించడంలో ముందుంటున్నాము’ అని ఆమె వివరిస్తుంది.

ఓ రోల్‌ మోడల్‌గా…
‘ఏ రంగంలోనైనా మనం మన విశ్వసనీయతను నిరూపించుకోవాలని భావిస్తాం. దానికి కారణం మనం మహిళలుగా ఉండడం. మగవారిలా మనం కూడా మన విజయాల గురించి మాట్లాడుకోవాలి. అయితే ఈ రంగంలో నాకంటే సీనియర్లైన రోల్‌ మోడల్స్‌ ఉండటం నాకు దక్కిన మంచి అవకాశం. భవిష్యత్‌లో నేను కూడా ఓ రోల్‌ మోడల్‌గా ఉండాలనుకుంటున్నాను’ అని ఆమె అంటున్నారు. మహిళలు గణనీయమైన సంఖ్యలో శ్రామిక శక్తిలోకి ప్రవేశిస్తున్నారు. కానీ కెరీర్‌ మధ్యలో వివాహం, పిల్లల సంరక్షణతో పాటు ఇతర సంరక్షణ బాధ్యతలతో బయటకు వెళ్లిపోతున్నారు. ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడంలో మహిళలకు రీనా మద్దతు ఇస్తున్నారు.

కొత్తది నేర్చుకుంటూ…
రీనా ప్రస్తుతం వెయ్యి మందికి పైగా వ్యక్తుల బృందానికి నాయకత్వం వహిస్తుంది. వారిలో సాధికారతపై దృష్టి సారించే నాయకత్వ శైలిని అభివృద్ధి చేస్తోంది. వేగవంతమైన, నిరంతరం మార్పుకు గురవుతున్న వాతావరణంలో అభివృద్ధి చెందిన వ్యక్తిగా, సాంకేతిక రంగంలో జరుగుతున్న మార్పుల గురించి తెలుసుకునేందుకు రీనా ఆసక్తిగా ఉంది. ‘నేను దాదాపు ఆరేండ్లుగా ఈ సంస్థతో ఉన్నాను. చేసే పనిలో వేగాన్ని నేను ఇష్టపడుతున్నాను. ప్రతి రెండు నెలలకు ఏదో ఒక మార్పు జరుగు తూనే ఉంటుంది. కొత్తది నేర్చుకుంటూనే ఉంటాము. అదే నన్ను నన్నుగా నిలబడుతోంది. నేను వ్యాపారాన్ని మరింత అభివృద్ధి ఎలా చేసుకోవాలో చూస్తున్నాను. వృద్ధి పరంగా నాయకత్వంపై చాలా అంచనాలు ఉన్నాయి. కొత్త పనులు చేయడానికి జరుగుతున్న ప్రయత్నంలో భాగం కావడం ఉత్తేజకర మైనది’ అంటూ రీనా తన మాటలు ముగించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -