అగ్ర కథానాయిక సమంత నటిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ చిత్ర ట్రైలర్‌ను ఈనెల 9న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
సమంతతో గతంలో ‘ఓ బేబీ’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకురాలు నందినిరెడ్డి మరోసారి ఈ సినిమాని రూపొందిస్తున్నారు. దీంతో ఈ హిట్ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. డిఫరెంట్ ఎమోషన్స్, స్టోరీ, బోల్డ్‌గా, గ్రిప్పింగ్ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో సమంత ప్రధాన పాత్రలో నటించడంతోపాటు ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు కలిసి ఈసినిమాని నిర్మిస్తున్నారు. దిగంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటిస్తుండగా, గౌతమి, మంజుషా ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమా టోగ్రఫీ: ఓం ప్రకాశ్, సంగీతం : సంతోష్ నారాయణన్, కథనం, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ :వసంత్ మారిన్‌గంటి, రాజ్ నిడిమోరు, క్రియేటీవ్ సూపర్ విజన్ : సీతా ఆర్ మీనన్.
ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



