Saturday, March 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమిల్లర్లపై బిగుస్తున్న ఉచ్చు..

మిల్లర్లపై బిగుస్తున్న ఉచ్చు..

- Advertisement -

ఆస్తుల జప్తునకు కసరత్తు
హైకోర్టులో కేసు
అధికారులకు బెదిరింపు కాల్స్‌
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

ప్రభుత్వానికి అందించాల్సిన ధాన్యాన్ని సొమ్ము చేసుకున్న మిల్లర్లపై కేసులు నమోదు కావడంతోపాటు వ్యక్తిగత ఆస్తులను జప్తు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. నల్లగొండ జిల్లాలోని ఏడుగురు మిల్లర్లు రూ.192 కోట్ల విలువ చేసే 75 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కాజేశారని పౌరసరఫరాల శాఖ అధికారుల విచారణలో తేలింది. ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.
2023-24 సంవత్సరానికి సంబంధించి బహిరంగ వేలానికి సంబంధించిన ధాన్యాన్ని పక్కదోవ పట్టించారని, వారిపై పౌరసర ఫరాలశాఖ అధికారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో నల్లగొండ, చిట్యాల, మునుగోడు, కేతపల్లిలో కేసు నమోదు చేసి ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించగా మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. వారు హైకోర్టును ఆశ్రయించి క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులకు, పౌరసర ఫరాలశాఖ అధికారులను హైకోర్టు ఆదేశించిం ది. ఈనెల 18న వాదనలు జరగనున్నాయి.

ఆస్తుల జప్తు కోసం కసరత్తు
ధాన్యం ఎగ్గొట్టి సొమ్ము చేసుకున్న మిల్లర్ల నుంచి ఎలాగైనా రికవరీ చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశాలకు అనుగుణంగా రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లర్ల ఆస్తుల జప్తునకు అన్ని చర్యలు ముమ్మరం చేస్తున్నారు. అధికారులు మరోసారి క్షేత్రస్థాయిలో ధాన్యం నిల్వలను తనిఖీ చేపట్టారు. సీఎంఆర్‌ ఎగ్గొట్టిన మిల్లర్ల ఆస్తులకు సంబంధించి జాయింట్‌ సర్వే నిర్వ హించి.. ఎక్కడెక్కడ ఆస్తులున్నాయనే విషయా లను ఆరా తీసి ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమవుతున్నారు. అధి కారులు ఇప్పటికే మిల్ల ర్లు ఉపయోగిస్తున్న బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేయించారు. ఆయా బ్యాంకు అధికారులను కలిసి మిల్లర్లు ఎలాంటి నగదు లావాదేవీలు జరపకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యాంకు మేనేజర్లు సైతం వారి ఖాతాలు, లావాదేవీలు జరపకుండా నిలిపివేశారు.

అధికారులకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌
బహిరంగ వేలానికి సంబంధించిన ధాన్యం బహిరంగ మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకోవడమే కాకుండా ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని ఇవ్వమని అడిగినందుకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రాజకీయ ఒత్తిడి, మరోవైపు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -