– మనీలాండరింగ్‌పై ఎస్‌ఎఫ్‌ఐఒ దర్యాప్తు
– కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయం
ముంబయి : రిలయన్స్ గ్రూపు ఛైర్మన్ అనిల్ అంబానీ చుట్టు మరింత ఉచ్చు బిగుస్తోంది. బ్యాంక్‌ల నుంచి వేల కోట్లు అప్పులు తీసుకుని.. నిధుల మళ్లింపు, మనీలాండరింగ్‌కు పాల్పడిన అంబానీపై కొత్తగా కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దర్యాప్తును ప్రారంభించింది. రూ.17,000 కోట్ల బ్యాంక్ రుణాల మళ్లింపునపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి), సిబిఐ, సెబీ విచారిస్తున్నాయి. తాజాగా రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, సిఎలతో సహా పలు గ్రూప్ కంపెనీల మోసాలపై దర్యాప్తును ప్రారంభించినట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.భారీ ఎత్తున నిధులను దారి మళ్లించడం, కంపెనీల చట్టం కింద తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపాయి. ఈ కేసును తీవ్రమైన మోసాలపై దర్యాప్తు చేసే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఒ)కు బదిలీ చేసినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ వర్గాలు వెల్లడించాయి. దర్యాప్తులో సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిలో బాధ్యులను ఎస్‌ఎఫ్‌ఐఒ గుర్తించడం ద్వారా తదుపరి చర్యలు ఉండనున్నాయి. ఈ వారం ప్రారంభంలోనే రిలయన్స్ గ్రూప్ సంస్థలకు చెందిన దాదాపు రూ.7,500 కోట్ల విలువైన ఆస్తులను ఇడి అటాచ్ చేసింది. వీటిలో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన 30 ఆస్తులు, అధార్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ, మోహన్ బీర్ హైటెక్ బిల్డ్, గమేసా ఇన్వెస్ట్ మెంట్ మేనేజ్ మెంట్, విహాన్ 43 రియల్టీ, కాంపియన్ ప్రాపర్టీస్ తదితర ఆస్తులున్నాయి. ఈ కేసులో ఇడి దూకుడు పెంచగా.. మరోవైపు ఎస్‌ఎఫ్‌ఐఒ దర్యాప్తు చేపట్టడంతో అనిల్ అంబానీ ఆక్రమాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
అనిల్ అంబానీకి బిగుస్తోన్న ఉచ్చు
- Advertisement -
- Advertisement -



