నవతెలంగాణ – జుక్కల్
గిరిజన లంబాడాల పోడు భూముల సమస్యలను వెంటనే తీర్చాలని కోరుతూ మంత్రి సీతకు కలిసి వినతి పత్రం అందించినామని ట్రీకార్ చైర్మన్ బిల్లా నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం జుక్కల్ మండల పరిధిలోని సమస్యలు , జుక్కల్ మండలము లోని 17 తండాలా అవస్థలను మరియు పోడు భుముల గురించి మంత్రి సీతక్కకు వివరించడం జరిగింది. దానికి గాను ఈనెల ఆఖరిలో గిరిజన మంత్రి సీతక్క తో గోర్ బోలి మా లంబాడా భాషను 8 వ షెడ్యూల్ లో చేర్చాలని తెలపడం జరుగుతుందని వివరించారు.
పోడు భూముల సమస్యలు , లంబాడాల భాషను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ దానికి సంబంధించి బీల్లయ నాయక్ ట్రికార్ చైర్మన్ మరియు కొట్నక్ తిరుపతి తెలంగాణ గిరిజన కోపరేట్ కార్పొరేషన్ లో కలవడం జరిగింది. వారు సాను కులంగా స్పందించడం జరిగింది. ఇందులో భాగంగా లంబాడా హక్కుల పోరాట సమితి నియోజకవర్గ ఇంఛార్జి రవి, లంబాడా హక్కుల పోరాట సమితి జుక్కల్ మండల అధ్యక్షులు అనిల్ నాయక్, యువజన నియోజకవర్గ ఇంఛార్జి కిషన్ నాయక్ మరియు లంబాడా హక్కుల పోరాట సమితి యువజన విభాగం అధ్యక్షుడు లక్ష్మణ నాయక్ మరియు లంబాడా హక్కుల పోరాట సమితి సబ్యులు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజనుల పోడు భూముల సమస్యలు వెంటనే తీర్చాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES