నవతెలంగాణ – రాయపోల్
79 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాయపోల్ మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. రాయపోల్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ కృష్ణమోహన్ , పోలీస్ స్టేషన్ వద్ద ఎస్ఐ కుంచెం మానస , మండల వనరుల కేంద్రం ఎంఈఓ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో బాలయ్య , ఐకెపి కార్యాలయం వద్ద మండల అధ్యక్షురాలు సౌందర్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్యాధికారి మహారాజు, రైతు వేదిక వద్ద వ్యవసాయ అధికారి నరేష్, గ్రామపంచాయతీ వద్ద పంచాయతీ ప్రత్యేక అధికారి బాలయ్య, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ప్రధానోపాధ్యాయులు నాగరాజు, ప్రాథమిక పాఠశాల వద్ద ప్రధానోపాధ్యాయులు హనుమంత రెడ్డి, కేజీబీవీ పాఠశాల వద్ద ఎస్ఓ సుగంధ లత, అంగన్వాడి సెంటర్ల వద్ద అంగన్వాడి టీచర్లు, యువజన సంఘాల కార్యాలయాల వద్ద సంఘాల అధ్యక్షులు, పార్టీ కార్యాలయ వద్ద పార్టీల అధ్యక్షులు జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించే 79 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా స్వాతంత్రం యొక్క విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాలయ్య, ఏపీఎం యాదగిరి, ఎంపీఓ శ్రీనివాస్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, దిశ కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తప్పటి సుధాకర్, కల్లూరి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రాజు గౌడ్, పాల రామాగౌడ్, పంచాయతీ కార్యదర్శి శివకుమార్, అంగన్వాడి టీచర్లు రేఖ, పద్మ, ఆగమ్మ,సంతోష, ఉపాధ్యాయులు, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వాడవాడలా రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES