నవతెలంగాణ – హాలియా
ఆ పోరాట స్ఫూర్తితో మతోన్మాదంపై పోరాటం
సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ: సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన మహోత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ రైతంగా సాయుధ పోరాట నాగార్జునసాగర్ నియోజకవర్గ స్థాయి వార్షికోత్సవ సభ లో జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను అధ్యక్షతన జరిగిన స్థానిక పార్టీ కార్యాలయంలో హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలనలో జరుగుతున్న దోపిడీ పీడన వెట్టిచాకిరికి దొరల జమీందారులు జాగిర్దారులకు వ్యతిరేకంగా జరిగిన మహత్తర పోరాటంలో కమ్యూనిస్టు యోధాను యోధులు అనేక త్యాగాలు చేసి ప్రజల కండగా నిలబడ్డారని అన్నారు. పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని మూడు వేల గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయని, వెట్టిచాగిరి రద్దు చేయబడిందని జమీందారులను గ్రామాల నుండి తరిమికొట్టారని అన్నారు.
కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చిన్న పాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ మహత్తర పోరాట చరిత్రను బిజెపి వక్రీకరించి ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందూ ప్రజలు పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఆ పోరాటంలో అనేకమంది ముస్లింలు ముగ్దీమ్ మోయీద్దిన్, సోయబుల్లా ఖాన్,షేక్ బందగి తదితరులు నిజాం పాలన వ్యతిరేకంగా విరోచితంగా పోరాడారని అన్నారు.
ఈ రాష్ట్రంలో సాయుధ పోరాట నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని అన్నారు. ఈ చరిత్రను చరపాలని చూస్తే సూర్యునిపై ఉమ్మేసినట్టేనని అన్నారు. ఈనెల పది నుండి 17 వరకు జరిగే సాయుధ పోరాట వారోత్సవాలను పల్లె పల్లెల్లో ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శిలు దైద శ్రీను, దుబ్బారాం చంద్రయ్య, కందుకూరు కోటేష్, జటావత్ రవి నాయక్, మండల కమిటీ సభ్యులు ఆకారపు నరేష్, కారంపూడి ధనమ్మ, కోరే రమేష్,మల్లికంటి చంద్రశేఖర్, రేవెల్లి వెంకటేశ్వర్లు, వెంపటి మహేష్, కొండేటి సామంతు, పొదిల వెంకన్న, ఎస్కే జానీ, దొరపల్లి మల్లయ్య, దుబ్బ కొండల్, అనిల్, రంగా, కమల, మంగ, శాంతి తదితరులు పాల్గొన్నారు.