నవతెలంగాణ – కంఠేశ్వర్
సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే 195వ జయంతి పురస్కరించుకొని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి శనివారం నివాళులు అర్పించారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ.. దేశంలో ఉన్న సామాజిక అంచివేత వివక్షత మహిళల పట్ల రెండవ తరగతి పౌరులుగా గుర్తింపు పోవాలనే ఉద్దేశంతో మహాత్మ జ్యోతిబాపూలే తన సహచరు అయిన పూలేను చదువు చెప్పించి ఆడ పిల్లలకు ప్రత్యేకంగా చదువు చెప్పించడానికి పాఠశాలలను నెలకొల్పారని అన్నారు. ఆ రోజుల్లోనే మహిళా సాధికారిక సాధించాలని ఉద్దేశంతోటి కృషి చేశారని అన్నారు. దేశంలో ఉన్న ఫ్యూడల్ భావజాలం మూలంగా అప్పటికే ఈ సమాజంలో దళితులు బలహీన వర్గాలు మహిళలను చులకన భావం రెండవ తరగతి పౌరులుగా గుర్తింపును చూసి లేక మహిళలు తమ కాళ్ళపై తాము నిలబడి సాధికారతను సాధించాలంటే చదువుకోవటం మూలంగానే అది సాధ్యమవుతుందని అన్నారు.
ఆడపిల్లలకు చదువు నేర్పటంలో సావిత్రిబాయి పూలే విశేష కృషి చేశారని, కానీ నేటి పాలకులు ప్రధానంగా కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం మనస్ఫూర్తిని ఆధారం చేసుకొని మహిళల బట్టల పైన, తిండి పైన ఆంక్షలు విధించడమే కాక వారిపై రోజు రోజుకి దాడులు, దౌర్జన్యాలు హత్యలు, హత్యాచారాలు పెరిగిపోతున్న పట్టించుకునే పరిస్థితి లేకుండా పోతుందని అన్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావు ప్రాంతంలో బాలికపై దాడి చేసిన అప్పటి బిజెపి మంత్రి కోర్టులో తిరిగి జైలు పాలయ్యే పరిస్థితి వచ్చిందని భేటీ బచావో , బేటి పడావో నినాదం కేవలం కాగితాలకే పరిమితమైందని తన మనువాద సిద్ధాంతాన్ని విడనాడకుండా మహిళా సాధికారిక సాధ్యం కాదని ఆయన విమర్శించారు.
అందువల్ల మహిళా సాధికారిక సాధించాలన్న వివక్షతను అంతమొందించాలని అందరూ కలిసి సమైక్యంగా ఉద్యమించినప్పుడే సాధ్యమవుతుందని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడే సావిత్రిబాయి పూలే కు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్ రాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విగ్నేష్ మరియు నాయకులు రాజు, సూచిత, తదితరులు పాల్గొన్నారు.



