Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంభారత రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటమే సీతారాంకు నిజమైన నివాళి

భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటమే సీతారాంకు నిజమైన నివాళి

- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా ఏచూరి ప్రథమ వర్ధంతి సభలు

నవతెలంగాణ-విలేకరులు
భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడటమే సీతారాం ఏచూరికి మనమిచ్చే ఘన నివాళి అని సీపీఐ(ఎం) నాయకులు అన్నారు. శుక్రవారం సీపీఐ(ఎం) జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నిర్వహించిన సభల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కొత్తగూడెం సీపీఐ(ఎం) మంచికంటి భవన్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు మాట్లాడారు. తాను జీవించినంత కాలం కమ్యూనిస్టుగా జీవించడమే కాకుండా తాను మరణించి కూడా కమ్యూనిస్టు ఆశయాన్ని బతికించారని అన్నారు. సంగారెడ్డిలోని కేవల్‌ కిషన్‌ భవన్‌లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జయరాజ్‌ అధ్యక్షతన ‘మతోన్మాద దాడులు- రాజ్యాంగం-సెక్యూలరిజం ఆవశ్యకత’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు మాట్లాడారు.

దేశాన్ని రాజ్యాంగాన్ని మార్చేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలని, ప్రజాస్వామ్యం, సమానత్వం, రాజ్యాంగ రక్షణకు అందరు ఐక్యంగా పోరాటాలకు సిద్దం కావాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ‘సామ్రాజ్యవాదం, సవాళ్లు’ అనే అంశంపై కల్లూరి మల్లేశం అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ మాట్లాడుతూ.. సీతారాం ఏచూరి ఆశయసాధనకు సామ్రాజ్యవాదంపై తిరుగు బాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), న్యూడెమోక్రసీ, బీఎస్‌పీ, ఎంఆర్‌పీఎస్‌ నాయకులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పాషా, నరహరి స్మారక కేంద్రంలో నిర్వహించిన సభలో మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. సాయుధ పోరాటం పట్ల బీజేపీ చేస్తున్న ఎత్తుగడలను, చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నాలను తిప్పి కొట్టాలని కమ్యూనిస్టులకు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -