Tuesday, March 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉదయ సముద్రం కాల్వలను వెంటనే పూర్తి చేయాలి

ఉదయ సముద్రం కాల్వలను వెంటనే పూర్తి చేయాలి

- Advertisement -

– సాగునీరందించి యాసంగి పంటలను కాపాడాలి
– మునుగోడు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట 17గ్రామాల రైతుల ధర్నా
– ప్రతి ఏడాదీ యాసంగి సీజన్‌లో ఎండిపోతున్న పంటలు
నవతెలంగాణ- మునుగోడు

నల్లగొండ జిల్లాలోని ఉదయ సముద్రం ప్రాజెక్టు కాల్వలను పూర్తి చేసి మునుగోడు మండలంలో చెరువులను నింపాలని డిమాండ్‌ చేస్తూ ఉదయ సముద్రం రైతాంగ వేదిక ఆధ్వర్యంలో సోమవారం 17గ్రామాల రైతులు ధర్నా చేశారు. మండల కేంద్రానికి భారీగా తరలివచ్చి మార్కెట్‌ యార్డ్‌ నుంచి తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహిం చారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ నరేష్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కాల్వలపల్లి మాజీ సర్పంచ్‌ గట్టుపల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని నార్కట్‌పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి కాల్వల పూర్తికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆరెగూడెం, కాల్వలపల్లి, దోమలపల్లి మీదుగ వెళ్లే కాల్వను, ఉరుమడ్ల నుంచి కిష్టాపురం మీదిగా పలివెల, జక్కలవారిగూడెం, మునుగోడు చెరువులోకి వచ్చే కాల్వ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. నాలుగైదు ఏండు ్లగా యాసంగిలో భూగర్భ జలాలు తగ్గిపోయి చేతికొచ్చే సమయంలో వరి పంట పూర్తిగా ఎండిపోతుండటంతో రైతులు తీవ్రంగా నష్టపో తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి రెండు కాల్వల నిర్మాణ పనులను పూర్తిచేసి రైతులకు సాగునీరు అందిస్తే యాసంగిలో పంట చేతికొస్తదని చెప్పారు. ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించకపోతే మునుగోడు ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందని రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. వెంటనే ఉదయ సముద్రం ప్రాజెక్టును పూర్తిచేయాలని డిమాండ్‌ చేశారు, లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిం చారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురుజ రామచంద్రం, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్‌, మాజీ ఎంపీపీ పోలగోని సత్యం, మాజీ జెడ్పీటీసీలు జాజుల అంజయ్య గౌడ్‌, గోసుకొండ లింగయ్య, కాంగ్రెస్‌ ఓబీసీ జిల్లా కార్యదర్శి బూడిద లింగయ్య యాదవ్‌, పోలగాని సైదులు, బొల్గురి నరసింహ, మాల్గా యాదయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -