- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కుటుంబ పోషణ బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకున్న కోడలికి రాజస్థాన్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. భర్త చనిపోవడంతో అతడి ఉద్యోగం భార్యకు లభించింది. అయితే ఆమె తమ బాగోగులు చూసుకోవట్లేదని మామ భగవాన్ సింగ్ కోర్టును ఆశ్రయించారు. ఈ కారుణ్య నియామకం మొత్తం కుటుంబానికి చెందుతుందని కోడలు శశి కుమారి జీతం నుంచి ప్రతినెలా రూ.20వేలు తీసి సింగ్ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుపై సర్వత్రా ప్రశంసలొస్తున్నాయి.
- Advertisement -

 
                                    