- మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బడితేల రాజయ్య
నవతెలంగాణ-మల్హర్ రావు: మండలంలో రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు అన్నివర్గాల ప్రజలకు, అన్నివిధాలా అభివృద్ధి చేశారు కాబట్టి ఇటీవల జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్షిన అభ్యర్థులను బారి ఓటర్లు మెజార్టీతో గెలిపించారని,ఎలాంటి అభివృద్ధి చేయని బిఆర్ఎస్ గుండుసున్నా ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య అన్నారు.సోమవారం రుద్రారంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఎప్పుడూ ఒక్కరిపై అసత్యపు ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మరని,అభివృద్ధి చేసి చూపిస్తేనే నమ్ముతారని పేర్కొన్నారు.ప్రజలను మోసం చేయడం,మాయమాటలు చెప్పడం,నాణ్యత లోపంతో చెక్ డ్యామ్స్ కట్టడం, హామీలు విస్మరించడంతోనే బిఆర్ఎస్ ను ప్రజలు నమ్మలేదన్నారు.రాబోయే రోజుల్లో ఎంపీపీటీ,జెడ్పిటిసి ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


