తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మహిళా కోటాపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం ఏకపక్షమని తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత అభిప్రాయపడ్డారు. బీసీ ఆడబిడ్డలకు రిజర్వేషన్ కోటా లేకుండానే ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని జాగృతి కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజనకు మహిళ బిల్లుకు ముడి పెట్టడం సరైందికాదన్నారు. కానీ బిల్లుకు సంబంధించిన ప్రయోజనం మాత్రం పోస్ట్ డేటేడ్ చెక్ మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తామనడం అన్యాయన్నారు. 2027 జనాభా గణనన తర్వాతే మహిళా రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈసారి జనగణనలో బీసీల లెక్క తేలిన తర్వాత ఆ మహిళలకు కూడా సబ్ కోటా ఇవ్వాలని సూచించారు. వెంటనే డ్రాఫ్ట్ బిల్లును అన్ని రాజకీయ పార్టీలకు అందజేయాలని డిమాండ్ చేశారు.
మహిళా కోటాపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం ఏకపక్షం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



