నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హర్రర్ చిత్రం ‘హనీ’. ఓవిఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది. నిజ జీవిత సంఘటనల నుంచి పొందిన ప్రేరణతో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజిక్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర టీజర్‌ని రిలీజ్ చేశారు. ఇప్పటివరకు మనం చూసిన హర్రర్‌కు భిన్నంగా ఈ టీజర్ ఒక మార్మిక ప్రపంచాన్ని ఆవిష్కరించింది. దర్శకుడు కరుణ కుమార్ ఇప్పటివరకు ఎన్నడూ చూడని కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడనే సంకేతాలు టీజర్‌లో బలంగా కనిపిస్తున్నాయి.
హర్రర్‌ను కేవలం భయపెట్టే అంశంగా కాకుండా ఊహకు అతీతంగా ప్రజెంట్ చేస్తున్న విధానం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ ‘ఏదో పెద్ద రహస్యం దాగుంది’ అనే ఫీలింగ్ కలుగుతుంది. నవీన్ చంద్ర లుక్, పెర్ఫార్మెన్స్ స్టన్నింగ్‌గా ఉంది. దివి, రాజా రవీంద్ర పాత్రలు కూడా భిన్నంగా కనిపించాయి. అజయ్ అరసాడ సంగీతం బీజీఎం గూస్‌బమ్స్ తెప్పించింది. సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హర్రర్ అంశాల సమ్మేళనంతో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు సిద్ధంగా ఉంది.
భిన్నంగా భయపెట్టే ‘హనీ’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



