Wednesday, February 25, 2026
E-PAPER
Homeజిల్లాలుచిన్నారిని కాళ్ళతో తన్ని చంపిన అగ్రవర్ణ పెత్తందారులను అరెస్ట్ చేయాలి

చిన్నారిని కాళ్ళతో తన్ని చంపిన అగ్రవర్ణ పెత్తందారులను అరెస్ట్ చేయాలి

- Advertisement -
  • కల్లూరి మల్లేశం సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
  • నవతెలంగాణ- ఆలేర్ రూరల్
  • నాగర్ కర్నూల్ జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతరలో దళిత, రజక కుటుంబ వ్యక్తులను కులం పేరుతో దూషించి, తీవ్రంగా కొట్టి హింసించి, రెండు నెలల పసికూనను కాళ్ళతో తన్ని చంపిన అగ్రవర్ణ పెత్తందారీ దుర్మార్గులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రోజున ఆలేరు పట్టణ కేంద్రంలో కులదురహంకర దిష్టిబొమ్మను దగ్దం చేయడం జరిగింది.
  • ఈ సందర్భంగా కల్లూరి మల్లేశం మాట్లాడుతూ.. కుమ్మరెలో జరిగిన మల్లన్న జాతర లో దైవదర్శనానికి వచ్చిన రజక కుటుంబానికి చెందిన గణేష్ మౌనిక దంపతులను ఆ గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి, ఆయన అనుచరులు శ్రీనివాసరెడ్డి ఇతరులు అడ్డుకొని ఘర్షణకు దిగి గణేష్ పై దాడి చేసి దండం పెట్టినా వినకుండా రెండు నెలల చిన్న పాపను కాళ్లతో తన్ని శిశువుని హత్య చేసిన దుండగులపై నేటికీ హత్యానేరం కేసు నమోదు చేయకపోవడం సిగ్గుచేటన్నారు.
  • కేవలం బిఎన్ఎస్ 194 సెక్షన్ నమోదు చేయడం అంటే అనుమానాస్పద మృతిగా,ఆత్మహత్యగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం హంతకులను కాపాడటమేనన్నారు.కు లదురహంకర హత్యలకు పాల్పడిన వారిని కఠినంగా  శిక్షించాలని లేని పక్షంలో సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం) జిల్లా కమిటి సభ్యులు ఎం ఏ ఇక్బాల్, మండల కార్యదర్శి దూపటి  వెంకటేష్, సీనియర్ నాయకులు మొరిగాడి చంద్రశేఖర్,నాయకులు మొరిగాడి రమేష్,నల్లమాస తులసయ్య,వడ్డేమాన్ బాలరాజు గణగాని మల్లేష్, కాసుల నరేష్, భాస్కర్, ఐలయ్య, అశోక్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -