Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అర్బన్ కాలనీ అండర్ పాస్ కల్వర్టును వెంటనే ప్రారంభించాలి..

అర్బన్ కాలనీ అండర్ పాస్ కల్వర్టును వెంటనే ప్రారంభించాలి..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
అర్బన్ కాలని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్న అండర్ పాస్ కల్వర్టు వద్ద హైట్ గేజ్ ఎర్పాటు చేసి వెంటనే ప్రారంభించాలని డివైఎఫ్ఐ  జిల్లా కమిటి సభ్యులు షేక్ రియాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం  హైట్ గేజ్ నిర్మాణం త్వరగ పూర్తిచేసి కల్వర్టుని అర్బన్ కాలనీవాసులకు అందుబాటులో తీసుకురావాలని  దక్షిణ రైల్వే మండరి జనరల్ మేనేజర్ కి కాలనివాసులను కలుపుకొని ఉత్తరం రాసారు. ఈ సందర్భంగా వ ఆయన అండర్ పాస్ కల్వర్టు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి అయినప్పటికీ రైల్వే శాఖ హైట్ గేజ్ ఏర్పాటు చేయలేదన్నారు. దీంతో కాలనీవాసులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అర్బన్ కాలనీ అండర్ పాస్ కల్వర్టులో 339 సౌత్ సెంట్రల్ రైల్వే అండర్ పాస్ సీసీ వేసి నిరుపయోగంగా ఉంచారన్నారు. సిసి రోడ్లు పనులు కూడా పూర్తయ్యాయని తెలిపారు. హైట్ గేజ్ ఏర్పాటు చేయలేదని రాకపోకలను నిలిపివేశారు అన్నారు.. ఈ కార్యక్రమంలో అర్బన్ కాలనీ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు. ఎండి సాజిద్. ఎండి సోహెల్. రాధా రపు తరుణ్. రాధారపు పవన్, తాళ్లపల్లి హరీష్ కుమార్, ఏపూరి శివ చైతన్య, కొండోజు అరవింద్ చారి, ఎస్డి అమన్, ఎస్కే ఫయాజ్ పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad