సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జులకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడటౌన్
యూరియా కోసం పెట్టిన యాప్‌ను ఎత్తేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. లేనిపోని నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బందులు పెడుతోందని, యాప్‌తో రైతులు తిప్పలు పడుతున్నారని అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు కనీస మద్దతు ధర కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్రం ఉందన్నారు.
యూరియా యాప్ వల్ల దుకాణదారులు స్టాక్ లేదంటూ బోర్డులు పెడుతున్నారని, ఇది దుర్మార్గమైన చర్య అన్నారు. యూరియాను యాప్ ద్వారా పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఆరు జిల్లాల్లో పెట్టిందని, కానీ దీనివల్ల చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ స్టాక్ లేదని బుకాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేశ్, రైతు సంఘం నాయకులు వీరెపల్లి వెంకటేశ్వర్లు, నాయకులు పాండు, రవినాయక్, జైశ్రీరామ్, రామచంద్రు ఉన్నారు.



