కారకాస్ : వెనిజులా సమీపంలోని అంతర్జాతీయ జలాలలో అమెరికా దళాలు మరో చమురు ట్యాంకర్‌ను వెంటాడుతున్నాయి. ఈ విషయాన్ని అమెరికా అధికారి ఒకరు ధృవీకరించారు. నికొలస్ మదురో నేతృత్వంలోని వెనిజులా ప్రభుత్వంపై అమెరికా తీవ్రమైన ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే రెండు చమురు ట్యాంకర్లపై దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకున్న అమెరికా దళాలు తాజాగా మరో ట్యాంకర్ వెంటపడ్డాయి. ఈ చమురు నౌక ఓ తప్పుడు పతాకంతో ప్రయాణిస్తోందని అమెరికా అధికారి ఆరోపించారు. దీనిని స్వాధీనం చేసుకోవా ల్సిందిగా ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. కాగా ఈ నౌక అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటోందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.
అయితే అందులో ఎవరూ లేరని చెప్పింది. చమురు నౌక ఎక్కడ ఉన్నది, దాని పేరు ఏమిటి అనే సమాచారాన్ని అమెరికా అధికారి తెలియజే యలేదు. అయితే దీని పేరు బెల్లా-1 అని, అది ముడి చమురును రవాణా చేసే పెద్ద నౌక అని, దానిపై అమెరికా ఆర్థిక శాఖ గత సంవత్సరమే ఆంక్షలు విధించిందని బ్రిటన్‌కు చెందిన మారీటైమ్ రిస్క్ మేనేజ్‌మెంట్ గ్రూప్ వాన్‌గార్డ్ తెలిపింది. ఈ నౌకకు ఇరాన్‌తో సంబంధం ఉన్నదని చెప్పింది. అమెరికా తీర గస్తీ దళం వెంటపడే సమయానికి నౌక ఖాళీగానే ఉన్నదని తెలుస్తోంది. ఈ నౌక 2021లో వెనిజులా చమురును చైనాకు రవాణా చేసింది. అంతకుముందు అది ఇరాన్ ముడి చమురును సరఫరా చేసింది.
చమురు ట్యాంకర్‌ను వెంటాడుతున్న అమెరికా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



