వాషింగ్టన్ : అరవై ఆరు అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా బుధవారం ప్రకటించింది. వీటిలో ఐరాస జనాభా ఏజెన్సీ, అంతర్జాతీయ వాతావరణ సంప్రదింపుల కోసం ఉద్దేశించిన ఐరాస ఒప్పందం ఉన్నాయి. సంస్థలు, ఏజెన్సీలు, కమిషన్లకు అమెరికా మద్దతును ఉపసంహరిస్తూ దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. వీటిలో ఐక్యరాజ్యసమితికి చెందినవి కూడా ఉండడం గమనార్హం. ఈ అంతర్జాతీయ సంస్థలన్నీ నిరుపయోగమైనవని, సమర్ధవంతంగా పనిచేయడం లేదని, ప్రమాదకరమైనవని ట్రంప్ ప్రభుత్వం తన సమీక్షలో తేల్చింది. మరికొన్ని అంతర్జాతీయ సంస్థలపై సమీక్ష కొనసాగుతోంది.
ఈ సంస్థల నిర్వహణ సరిగా లేదని, అవి కొందరి వ్యక్తిగత అజెండాల కోసం పనిచేస్తున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో చెప్పా రు. ఈ సంస్థలు అమెరికా సార్వభౌమత్వానికి, స్వేచ్ఛకు, సౌభాగ్యానికి ముప్పు గా పరిణమించాయని ఆరోపించారు. ఇలాంటి సంస్థలకు అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును ధారాదత్తం చేయడం తనకు ఇష్టం లేదని ట్రంప్ స్పష్టం చేశారని తెలిపారు. కాగా వాతావరణం, కార్మికులు, వలసలు, ఇతర అంశాలపై దృష్టి సారిస్తున్న పలు ఐరాస ఏజెన్సీలు, కమిషన్లకు ట్రంప్ నిధులు ఆపేశారు. పార్టనర్‌షిప్ ఫర్ అట్లాంటిక్ కో-ఆపరేషన్, ది ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డెమొక్రసీ అండ్ ఎలక్టొరల్ అసిస్టెన్స్, గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం ఫోరం వంటి ఐరాస యేతర సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
66 అంతర్జాతీయ సంస్థలకు అమెరికా గుడ్‌బై
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



