ఏరియా యస్ ఓ టూ జి యం బి .శ్రీనివాస చారి కి వినతి ..
నవతెలంగాణ – మణుగూరు
మణుగూరు ఏరియాలో ఉపరితల విభాగంలో జనరల్ అసిస్టెంట్ ఖాళీలను గుర్తించి వాటిని పాత పద్ధతిలోనే కొండాపురం అండర్ గ్రౌండ్ కార్మికులతో మాత్రమే భర్తీ చేసే విధంగా యాజమాన్యం చొరవ చూపాలని కోరుతూ ఏరియా యస్ ఓ టూ జి యం బి .శ్రీనివాస చారి కి ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రాన్ని అందించారు. జనరల్ అసిస్టెంట్ ఖాళీల భర్తీ అంశంలో ఈ ఏడాది ఏప్రియల్ మాసంలో యాజమాన్యం కొత్తగా నిబంధనలు పొందు పరచి కార్పొరేట్ సర్క్యులర్ విడుదల చేయడం జరిగిందని దాని వల్ల స్థానికంగా పని చేస్తున్న అండర్ గ్రౌండ్ జనరల్ అసిస్టెంట్ లకు నష్టం వాటిల్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్క్యులర్ లో స్వల్ప మార్పులు చేపట్టి సవరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బంగారి పవన్ కుమార్, పడ్డం శ్రీనివాస్,బత్తుల శ్రీనివాస్, మంగిలాల్, ఆదర్శ్, రాజ, సాయి, శివ కృష్ణ, సాయి చంద్, వినయ్ తదితరులు పాల్గొన్నారు
పాత పద్ధతిలోనే ఉపరితల జనరల్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES